త్యాగ జీవుల స్వప్నంగా
రెప రెప లాడే జెండా!
రేపటి ఆశల అండ!
బానిస సంకెల తెంచగా
బలి దానాలెన్నో చేయగా
స్వేచ్చా వాయువు వీచెగా
స్వాతంత్ర్య కాంక్ష నెరవేరగా!
పరాయి పాలన అంతం చేయగ
ప్రతిధ్వనించిన స్వరాజ్య కేక
తర తరాలకు స్పూర్తిగా
వీరుల త్యాగపు కీర్తిరా!🇮🇳🇮🇳🇮🇳
అమరజీవుల ఆకాంక్షలు తీరగ
సమరయోధుల పోరాట ఫలముగా
భారతదేశం బంగారు బాటలో
సాగి పోవుటే స్మరణమురా!!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో💐💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి