పెద్దేముల్ KGBVలో ‘మదర్ ఆఫ్ మై స్కూల్’ చెట్టుకు ఘన సత్కారం
 

గుల్‌మోహర్ (మంకెన) చెట్టును అమ్మవారిగా అలంకరించి పూజించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
పెద్దేముల్, వికారాబాద్ జిల్లా:పాఠశాల ఆవరణలోని గుల్‌మోర్  (మంకెన) చెట్టుపై విద్యార్థులు, ఉపాధ్యాయులు మమకారం పెంచుకున్నారు. పెద్దేముల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) పాఠశాలకు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతున్న గుల్‌మోహర్ చెట్టును *“మదర్ ఆఫ్ మై స్కూల్”* పెద్ద చెట్టు గా గుర్తించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి చెట్టును అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చెట్టుకు నమస్కరించారు పాఠశాల ఆవరణలో చల్లని నీడనిస్తూ, స్వచ్ఛమైన గాలిని అందిస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులకు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ చెట్టును స్ఫూర్తిగా తీసుకుని చెట్లను కాపాడాలి.. ప్రకృతిని పరిరక్షించాలి అనే సందేశాన్ని విద్యార్థులు చాటారు.
చెట్లను కేవలం మొక్కలుగా కాకుండా మన జీవితంలో భాగంగా భావించి వాటిపై ప్రేమ, మమకారం పెంచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సందేశం ఇచ్చారు. పాఠశాల ఆవరణలోని గుల్‌మోహర్ చెట్టు విద్యార్థులందరికీ ‘మదర్ ఆఫ్ మై స్కూల్’గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిని రాజేశ్వరి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు