రంగు దారాలు కావు
అనుబంధాలకు ఆనవాళ్లు
అక్క తమ్ముడు - అన్న చెల్లి
అనురాగాలకు గుర్తులు...
ఉత్త ఊలుపోగులు కావు తమ్మీ!
హృదయం పంచి
ఊపిరి తుంచి
నెత్తురు అద్దిన
సుతిమెత్తని ఎడదల స్పందనలు...
దారపు వరుసలు కావవి
ప్రేమను పంచి ధీమా నిచ్చే
వావి వరుసలకు ఆధారాలు...
ఆత్మీయతలు అల్లిన వల్లరులు
సోదర ప్రేమకు సోపానాలు...
కష్ట సుఖాలలో తోడుంటానని
కట్టివుంచిన ప్రేమ బంధాలు
పట్టివుంచే పేగుల అనుబంధాలు...
నేనున్నానని ధైర్యం చెప్పే
వెన్నుదన్నుకు వేలుపు దీవెనలు...
అనురాగానికి అంకుర దీపము
కమ్మని బంధము కలిపే సూత్రము
కరకంకణమై వెలిగే రాఖీలు... 🌹🌹
💥సోదరసోదరీ మణులందరికీ 💥
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో 💐💐💐

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి