ఓ భరత కుమారా! నీవు ధన్యుడవు
అప్రయత్నముగా ప్రాప్తించిన రాజ్యమును
త్యజించుటకు సిద్ధమైనట్టి మంచి వాడవు
ఓ భరతా! కష్టాల పాలైన శ్రీరాముని
అయోధ్యకు తీసుకొని వచ్చుటకు
అభిలాషించుచున్నావు దీనివలన
నీ కీర్తి స్థిరస్థాయిగా యుండును
గుహుడు,భరతుడు సంభాషించుచుండగా
సూర్యుడు అస్తమించి చీకట్లు కమ్మెను
భరతశత్రఘ్నులు తన శిబిరమునకు చేరిరి
అతడు శ్రీరాముని గూర్చి ఆలోచించును
తండ్రి మృతిచే దుఃఖంలున్న భరతునికి
అన్నవియోగము శోకమునకు గురిచేసెను
భరతుని శోకాగ్నికారణముగా
అతని ఒళ్ళు పై స్వేదము దారలుగట్టెను
నరశ్రేష్టుడైన భరతుడు దిక్కుతోచనివాడై
మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను
శ్రీరామునికై అతడు దుఃఖించుండెను
భరతున్ని గుహుడు పలువిధముల ఓదార్చెను.
=================================
అయోధ్యకాండమందు 85వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి