87వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


"ఓ గుహుడా! ఆ రాత్రివేళ సీతారామ లక్ష్మణులు 
ఎక్కడ నివసించిరి? ఏమి భుజించిరి ?
వారు ఎట్టి శయ్యపై నిదిరించిరి? 
అవన్ని నాకు వివరముగా తెలుపుము 

అయ్యా! పంచభక్ష పరమాన్నములను 
నేను శ్రీరాములకు ఇచ్చితిని కాని 
వారవి స్వీకరించక దీక్షతో యుండిరి 
లక్ష్మణుడు తెచ్చిన జలములను త్రాగిరి 

లక్ష్మణుడు కుశలను తీసుకువచ్చి 
శయ్యను ఏర్పర్చి దానిపై కూర్చోబెట్టి 
శ్రీరాముని పాదములను కడిగెను 
సీతారాములు శయ్యపై శయనించిరి

లక్ష్మణుడు వారికి కొంత దూరముగా వెళ్లి 
ధనుర్భాణములతో నిలిచియుండెను
సీతారాములు ఈ గార చెట్టు క్రిందనే 
తృణశయ్య పైన ఆ రాత్రి గడిపినారు

శత్రుధమనుడైన లక్ష్మణుడు బాణములతో 
రక్షణ కవచములతో రక్షణగా యుండెను
నేను కూడా ధనుర్భాణములను ధరించి 
లక్ష్మణునికి తోడుగా యుంటిని.

==============================
అయోధ్యకాండమందు 87వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు