భారతీయ వస్త్రధారణ ప్రత్యేకం: - - యేచన్ చంద్ర శేఖర్-✆ 8885050822


వస్త్రధారణలో భారతీయ శైలి ఎంతో ప్రత్యేకం
ప్రపంచం యావత్తూ పలుకుతుంది నీరాజనం! 

పట్టు పరికిణీ, పావడాలే కదా అమ్మాయిలకు అందం 
బిగుతైన జీన్స్, టీషర్టు కలిగించగలవా గౌరవ భావం!

చీరకట్టు ఇనుమడింపచేస్తుంది అతివల అందం
పంచెకట్టు కదా ప్రదర్శిస్తుంది పురుషుని రాజసం!  

ఖద్దరు లాల్చీ, మడత నలగని ధోవతిలో గాంభీర్యం
కిర్రుచెప్పులు, చేతికర్రతో నడిస్తే ఎంతో హుందాతనం! 

కాలానుగుణంగా మార్పు అన్నది సర్వసాధారణం
అయితేనేమి శరీర గోప్యతను కాపాడడం అవశ్యం! 

విలువలను కాపాడే వలువలకే ఇవ్వాలి ప్రాధాన్యం  
కురచ వస్త్రాలలో అంగాంగ ప్రదర్శన జుగుప్సాకరం!     

ఆకులు అలముల నుండి ఆధునికునిగా ప్రస్థానం
అయినా సాంప్రదాయ దుస్తుల్లోనే ఉంది గౌరవం!   

భారతీయ చేనేత వస్త్రధారణలోనే ఆరోగ్యం నిక్షిప్తం
సదా నేతన్నలకు అందించాలి మనం ఆపన్నహస్తం!  

కామెంట్‌లు