ప్రవాస పద్య పరిమళం - 89: -- వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: చిత్రానికి పద్యము  
విషయము: ఊరువు నుండి ఊర్వశి సృష్టి 
ఛందస్సు:  చంపకమాల
నర నారాయణుల తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను 
పంపుతే నారాయణుడు తన ఊరువు నుండి ఒక సౌందర్యవతిని సృజించుట.



చంపకమాల:

తపమును జేయు తాపసికి ధ్యానము భంగమొనర్చ నింద్రుడే 
కపటము తోడ నప్సరస కన్యల గాలము చేసి పంపగా
జపమును జేసి నూర్వశికి జన్మము నిచ్చిన మౌని వర్యుడే
అపర విధాత! సంయమనమాతని సొత్తని చాటి చెప్పెనే 
###########################l
కామెంట్‌లు