90 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


మీ తండ్రి పదునాలుగు సంవత్సరములు
వనములో నివసించుమని పంపినాడు 
తిరుగులేని రాజ్యపాలన చేసే నీవు 
వీరికి ఏమి హాని చేయుటకై వచ్చావు 

శ్రీరామ లక్ష్మణుల పుణ్యాత్ములు
భరద్వాజముని పలికినట్టి కఠినమాటలు విని 
భరతుడు దుఃఖముతో కన్నీరుగార్చుచు
మహర్షితో అతడు ఇలా అంటాడు 

"ఓ మహామునీ! భూత భవిష్యద్వర్తమానములను
ఎరిగిన పూజ్యులు ఇట్లా అనుటతగదు 
నేను అయోధ్యలో లేని సమయమున 
నాతల్లికైకేయి చేసిన దుర్మార్గమైనపని ఇది 

ఆమె చేసినపని నాకు సమ్మతముగాదు 
నరశ్రేష్టుడైన శ్రీరాముని వేడుకొని
ప్రసన్నునిగావించుకొని రాజ్యపాలనకై
అయోధ్యకు గొనిపోవుటకై ఇటు వచ్చితిని

ఓ భారతా! నీ సంకల్పమును నేనెరుగుదు
శ్రీరాముని కడకు రేపు వెళ్లవచ్చు 
మీరందరు ఈ రాత్రి ఇచ్చటనే గడుపుడు
రాత్రి  వారు ఆ అశ్రమమునందే నిద్రించినారు.

====================================

అయోధ్యకాండమందు90 వ సర్గ సమాప్తం
కామెంట్‌లు