ప్రక్రియ :పంచపది
1.
దశాబ్దాల భారతీయ దాస్య,
ధ్వంసన సౌభాగ్య దినం!
అమరవీరుల కలల,
సాకార రూప సందర్శనం!
అతివాదం /మితవాదం ,
లక్ష్య సిద్ధానంద నిదర్శనం!
గాంధీ ,నేతాజీ, అనుచరుల,
కృతజ్ఞతాభివందనం!
"సారే జహాసే అచ్చా ,
హిందూ సితా ",
ధ్వనిద్దాం ,అనుదినం,
పివిఎల్!
2.
ఎగిరే తిరంగా, శతకోటి ,
జన హృదయాంతరంగ!
దేశం యావత్తు, ఆనందగంగ,
మునకలెన్నో వేయంగ!
తరాలన్నీ, తల ఎత్తి,
మాతా,వందేమాతరం, అనంగ!
జనగణ జాగృతి జాతీయ,
గీతం ప్రతిధ్వనించగ!
ఆబాల గోపాలం, అమిత,
ఆనంద, చిందులు వేయంగ,
పివిఎల్!
3.
పునరావృతం చేద్దాం,
చిన్ననాటి ప్రతిన!
విధులన్నీ, నిర్వహిద్దాం ,
అమ్మ మీద ఆన!
ఐకమత్యమే బలం,
మనమే ఓ నమూన!
జాతి సమైక్య భావన,
అనన్య సాధన!
సుమంగళి భరతమాత ,
నిత్యదీవెన, పివిఎల్!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి