:దేశం--దేహం.:- డా పివిఎల్ సుబ్బారావు.-:విజయనగరం.-సెల్:9441058797.


జననీ జన్మభూమిశ్చ,
             స్వర్గాదపి గరీయసి! 
భరతమాత అమ్మ,
            విశాల భారతం దేశం!
ఇక్కడ పుట్టడం ,
మన పూర్వజన్మ సుకృతం! 
సుజల ,సుఫల ,
మలయజశీతల, సుశోభితం!
తరాలన్నీ తలవంచి,
 తలచేది వందేమాతరం!

ఏ దేశమేగినా పొగడరా,
 జన్మభూమి భారతి! 
తూర్పు పశ్చిమ దేశాల,
 గాంచె ప్రఖ్యాతి!
"సారే జహాసే అచ్ఛా హిందూ,
 సితా హమారా" యశోగీతి!
విశ్వ కళ్యాణ సుందరి,
 నుదుటభాసించే తిలకద్యుతి!
ఈ దేశాన పుడితే లేదు,
 మరుజన్మ ,మోక్షమే ప్రాప్తి!

భగవాన్ వరదాన్ ,
మేరా భారత్ మహాన్!
మై శ్రద్ధావాన్ ,
మేరా జీవన్ బలిదాన్! 
నా జీవనం దేశదైవం ,
ఇచ్చిన అనన్యవరం! 
దేశ వినియోగంలోనే ,
నిహితం నా యోగక్షేమం! 
 దేశదైవచరణారవిందాన,
నాదేహసుమం సమర్పితం!

పొగలా బతకను,
 జ్వాలనై జ్వలిస్తుంటా! 
ఉన్నన్నాళ్ళు స్వాతంత్రం, 
కొమ్ము కాస్తుంటా!
అమరవీరుల వారసుడ్ని, 
నేనేనంటా!
వ్యక్తికి బహువచనం శక్తి ,
అని నిరూపిస్తానంటా! 
"దేశం-దేహం "అద్వైతం,
 నా అభిమతం అంటా!

నేను నా దేశానికి భరోసా!
 దేశాన నా బతుకు కులాసా! 
నేను పుట్టింది దేశం కోసం!
 లక్ష్యసిద్ధి ,అహర్నిశం శ్రమిస్తా!
 ఈ మన్నులో,మన్నునై తరిస్తా!
________
కామెంట్‌లు