మాట.....తేనెల మూట: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765.


నలుగురిలో కూర్చున్నప్పుడు నాజూగ్గా మాట్లాడాలి. పదిమందిలో ఉన్నప్పుడు మన మాట పసిడి లాగా ఉండి... పాడియై ధరజెల్లాలి. 
మాట మారితేనే, మనసు మారుతుంది. మనసు మారితేనే, జీవితం మారుతుంది. 
నాలిక చాలా పదునైనది. ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవాలి.
 సత్యం బ్రూయాత్.. ప్రియం బ్రూయాత్. సత్యాన్ని ప్రియంగా మాట్లాడినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
సత్య కామకుడు తన గోత్రం తెలియదు అని అబద్ధం ఆడకుండా సత్యాన్ని చెప్పిన ఒక్క మాట కారణంగా, గురువుగారు అతడిని శిష్యుడుగా స్వీకరించారు.  ఆ తర్వాత అతను గొప్ప రుషిగా తయారయ్యాడు. మాటతోనే అమృతం, మాటతోనే సుఖం, దుఃఖం అన్నీ వస్తాయి. చరిత్రలో కత్తితో సాధించలేనిది మాటతో సాధించవచ్చు అని నిరూపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.
 తెనాలి రామకృష్ణుడు చతురోక్తులతో శ్రీకృష్ణదేవరాయల మనసును చూర గొని ఆస్థాన కవి అయినాడు. అనేక బహుమతుల్ని అందుకున్నాడు. సుమతీ శతక కారుడు చెప్పినట్టు భూషణములు, భూషణములు పొందికగావున్... వాగ్భూషణమే గొప్పది అని తెలియజేయడం జరిగింది. సంస్కారంతో కూడిన ఒక మాట మనిషికి అలంకారం. బంగారం వేసుకుంటే అరిగిపోతుంది,వన్నె తగ్గుతుంది, కానీ మాట ఎప్పుడు కూడా వన్నె తగ్గదు. అందుకే మనిషికి వాగ్భూషణమే నిజమైన భూషణం. ఒక్క మాట మనిషి  మనసును రెండు ముక్కలు చేస్తుంది. ఆయనలో అశాంతి రేపుతుంది. మన ప్రతి మాట శరీరాన్ని, మనసును మారుస్తుంది. 
ఒక గ్లాసు నీళ్లపై ప్రేమ అని రాస్తే ఆ నీటిలోని అణువులు అందంగా మారుతాయట. అదే నీళ్లపై కోపం అని రాస్తే అణువులు విరిగిపోతాయట.

మాట ద్వారానే జ్ఞాన ప్రసారం

మన సంస్కృతిలో మాటకు చాలా గొప్ప స్థానం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు 
వాక్ ని దేవతగా సరస్వతిగా వాగ్వాదినిగా కొలుస్తాం. చాందోగ్య ఉపనిషత్ ప్రకారము 
వాగ్వైబ్రహ్మ... మాటయే బ్రహ్మం.. మాట ద్వారానే జ్ఞాన ప్రసారం జరుగుతుంది. గురువు నుండి శిష్యునికి తండ్రి నుండి కొడుక్కి జ్ఞానం మాటతోనే వెళుతుంది. కాబట్టి మాట చాలా పవిత్రమైంది, ఉన్నతమైంది. శ్రీరాముడు తండ్రి మాటకు కట్టుబడి నడుచుకున్నాడు. అందుకే శాశ్వతంగా ఆయన మాట రామాయణమై నిలబడింది. బృహదారణ్యక ఉపనిషత్ ప్రకారం అనవసరంగా మాట్లాడటం కంటే,  సత్యంగా మాట్లాడటం, ఉత్తమం అని చెప్పారు. మాట అనేది నిప్పులాంటిది, చల్లారితే వెలుగు, రెచ్చగొడితే కీడు. కాబట్టి కాలానుగుణ్యంగా నడక మాటను రూపొందించుకోవాలి. ఒక యజ్ఞం ఫలించడానికి కారణం మంత్ర రూపమైన మాటయే ప్రధానం. కావున మాట శక్తిని చక్కగా వాడుకోవాలి

డా. ఏపీజే అబ్దుల్ కలాం   మాట

పూర్వ రాష్ట్రపతి మిస్సైల్ మాన్,అబ్దుల్ కలాం గారి మాట.. కలలు కనండి అనేది వేలాదియువ జీవితాలపై ప్రభావాన్ని చూపింది.ఇవాళ కమ్యూనికేషన్ అనేది గొప్ప కళ గా ఆధునికలు చెబుతున్నారు. అలాగే బహుళ జాతి సంస్థలు, రైల్వేలు, హాస్పిటల్స్, వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో రిసెప్షనిస్టులకు ప్రాధాన్యత ఏర్పడి ఉపాధి కలుగుతుంది. 
రేడియో జాకీలు గా టీవీలో ఇతర షో లలో వ్యాఖ్యానం గొప్పగా అలరిస్తుంది.
 కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క మాట మనిషిని ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది.

సకారాత్మక పదాల శక్తి 
(Power of positive words)

మాటతోనే జీవితం మారుతుందని, ఉపనిషత్తులు మనోవిజ్ఞాన శాస్త్రం రెండూ ఒకే మాటని చెబుతున్నాయి. సకారాత్మక మాటలు విన్నప్పుడు మెదడులో డోపమైన్, సెరిటోనిన్, అని హార్మోన్ లు విడుదలవుతాయి. స్ట్రెస్ తగ్గుతుంది. ప్రతికూల పదాలు విన్నప్పుడు కార్టిజోల్ పెరిగి మెదడు ఫ్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మాటతోనే సంబంధాలు బలపడతాయి విడిపోతాయి. మాట ఒక ఎమోషనల్ బాండింగ్ ను ఏర్పరుస్తుంది. 
నాకు రాదు అని పదిసార్లు మీరు అంటే మెదడు నిజంగా రాదు అనే న్యూరాలను బలపరుస్తుంది. నేను ప్రయత్నిస్తాను అంటే మెదడు పరిష్కారాలను వెతుకుతుంది. మీరు మీతో మాట్లాడే ప్రతి మాట మీ మెదడును ప్రోగ్రాం చేస్తుంది. దీనినే self talk అంటారు. మనం అనే మాటలు ఎదుటి వ్యక్తి మెదడులో reflect అవుతాయి.
 మాట ఒక వైరస్ లాంటిది 
కొన్ని సందర్భాల్లో ఇది సమాజాన్ని కాలుష్యం చేస్తుంది. దీనినే emotional contagion అంటారు.

మాట్లాడే ముందర

* *ఇది నిజమా అవసరమా?ఎదుటివారికి ఉపయోగపడుతుందా లేదా అనే అంశాలను ఒకటికి రెండుసార్లు విచారించాలి*

*మాట అనే విత్తనాన్ని నాటుతున్నాం కాబట్టి అది ఎలా  ప్రభావాన్ని చూపుతుందో  అనే విశ్లేషణ అని చేసుకోవడం మంచిది*

నువ్వు విసిరే ప్రతి మాట తిరిగి నీ దగ్గరికి వస్తుందని అంశాన్ని గుర్తుంచుకోవాలి

భూషణాల కన్నా చక్కని సంభాషణయే  గొప్పదని గ్రహిద్దాం 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
🌹👏మాట మీద ఇంత చెప్పిన మీకు అభినందనలు సోదరా 🙏🤝👑💞👍
అజ్ఞాత చెప్పారు…
మంచి మాట. అభినందనలు
అజ్ఞాత చెప్పారు…
👌🏻 బాగుంది