పూర్వము కౌశంభీ దేశాన్ని సింహ భూపాలుడు అను రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు పుత్రకామేష్ట యజ్ఞం చేయుట వలన అతనికి యజ్ఞ పురుషుని వరం వల్ల పుత్రునికి బదులుగా పుత్రిక జన్మించింది. ఆ పుత్రికకు
శివకామిని అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు ఆ రాజు భార్య "ప్రభు ప్రభూ! మన అమ్మాయికి వివాహ వయస్సు సమీపిస్తుంది. కాన ఓ మంచి సంబంధం చూసి ఆ కార్యం జరిపిస్తే మన బాధ్యత తీరుతుంది "అని అనగా "చూడు దేవేరి ! నీవేమీ ఆ విషయంలో ఆందోళన పడవద్దు. త్వరలోనే మన పుత్రికకు స్వయంవరం ప్రకటించి ఆ కార్యం నెరవేరుద్దాం అని భర్త చెప్పాడు.
మహారాజు, మహారాణి మాట్లాడుకున్న ఈ విషయం దొంగ చాటుగా సైన్యాధిపతి అయిన దుష్ట బుద్ధి విన్నాడు.
ఎలాగైనా ఆ స్వయంవరంలో తన కుమారుడైన దుర్జనునికి రాజకుమార్తెను వరించేలా చేయాలని ఓ పథకం పన్నాడు.
ఇలా ఉండగా రాజుగారు తన కుమార్తె స్వయంభురాన్ని ప్రకటించి, ఆ స్వయంవరం వివరాలను పొరుగు దేశాలరాజులకు చేరేలా చేశాడు. ఓ మంచి ముహూర్తం రోజున మహారాజు తన కుమార్తె స్వయంవరాన్ని ప్రకటించాడు.
ఎవరైతే ఈ స్వయంవరంలో మేము పెట్టిన మూడంచల పోటీలో గెలుస్తారో, వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించుటయేకాక వారికి చండ ప్రచండ మహావీర పరమ చక్ర బిరుదు ప్రధాన చేసి నా రాజ్యంలో అర్థ రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయబడుతుంది" అని తెలియజేశారు. ఆ దేశ ప్రజలందరూ ఈ పోటీని తిలకించేటందుకు మహారాజు ఏర్పాటు చేసిన మైదానానికి విచ్చేశారు. రాజ ఉద్యోగులందరూ పోటి
ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మైదానమంతా కోలాహలంతో అలరారుతుంది.
ఈ స్వయంవరం పోటీకి పొరుగు దేశాల మహారాజులు ఎందరో విచ్చేశారు. అలా విచ్చేసిన వారిలో కుంతల దేశం మహారాజు కుమారుడైన విక్రమ సేనుడు కూడా వచ్చాడు. అలాగే మహాసేనాన్ని కుమారుడైన దుర్జనుడు కూడా వచ్చాడు. ఆ మూడంచల పోటీలో ఎందరో పాల్గొన్న, పోటీలో చివరకు మిగిలింది ఇద్దరే ఇద్దరు. ఒకడు దుర్జనుడు, మరొకడు విక్రమ సేనుడు. ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో అని జలమంతా ఆసక్తితో పోటీని తిలకిస్తున్నారు.
మేము ప్రకటించిన మూడు అంచలపోటీ అంటే 1). గుర్రపు స్వారి, 2). మల్ల యుద్ధం, 3). మేధో మధనం. ఈ మూడింటిలో ఎవరు విజేత అవుతారో వారే మా పుత్రికను పరిణయమాడుటకు అర్హుడు అని మహారాజు మరోసారి అందరి సమక్షంలో విన్నవించాడు.
పోటి ప్రారంభమైయింది. మహాసేనాని కుమారుడైన దురదనుడు, కుంతల దేశాధిపతి కుమారుడైన విక్రమ సేనుడు అశ్వములను అధిరోహించి స్వారీ చేయుటకు సిద్ధమయ్యారు. అంతలోనే విక్రమసేనుడు తన గుర్రంపై నుండి దిగి, దాని కళ్ళకు చెవులకు పెట్టిన ఇనుప కచ్చడాలను, మరియు కూర్చునే జీనును తొలగించి మళ్లీ గుర్రం పైకి ఎక్కి కూర్చున్నాడు. స్వారీ ప్రారంభమైంది. విక్రమ సేనుని కన్న ముందే దుర్జనుడు నిర్దేశించిన స్థలాన్ని చేరుకున్నాడు. మళ్లీ అదే గుర్రంపై వెనక పరుగుతోనే ప్రారంభ స్థలానికి రావాలి. విక్రమ సేనుడు నిర్దేశించిన స్థలానికి చేరుకొని వెనుక పరుగులతో దుర్జనుని దాటేసి ప్రారంభ స్థలానికి చేరుకున్నాడు
విక్రమ సేనుడు ముందుకు ఉరికించడంలోను, వెనకకు అంతే వేగంతో ఉరికించడంలోను నిష్ణాతుడైనందున విజయం సాధించాడు. దుర్జనుడు కేవలం
ముందుకు కురిపించడమే నేర్చుకున్నాడు. కానీ వెనకకు కొరికించడం నేర్చుకోలేనందున ఓటమి పాలయ్యాడు.
రెండవ పోటీ మల్ల యుద్ధం ప్రారంభమైంది. దుర్జనుడు, విక్రమ సేనుడు ఇద్దరు తలపడ్డారు. ఒకరినొకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ కలియబడసాగారు. మల్ల యుద్ధ కదనరంగం దుమ్ము ధూళితో పూర్తిగా నిండి ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. విక్రమ సేనుడు మాత్రం శబ్ద వినికిడి విద్య నేర్చుకున్నందున ముందున్న వ్యక్తి కనిపించకపోయినా శబ్దం వచ్చిన దిక్కును గుర్తించి దెబ్బ వేయడంతో అర్జునుడు అనేకసార్లు దెబ్బలు తిని సొమ్మసిల్లి కింద పడి ఓడిపోయాడు. విక్రమ సేనుడు గెలిచాడు.
ఆ తరువాత మూడవ పోటి మేదో మధనం ప్రారంభమైంది.
మైదానం మధ్యలో ఓ ఎర్రటి తివాచి పరుచబడింది. ఆ తివాచి తల ప్రాంగణం వద్ద ఓ సింహాసనం ఏర్పాటు చేయబడింది. పోటీదారులు తివాచి తొక్కకుండా వెళ్లి సింహాసనంపై కూర్చోవాలి. ఆ తరువాత ఆ సింహాసనానికి ఎదురెదురుగా పెట్టిన నక్షత్రాలతో కూడిన ఆకాశం చిత్రపటం, గొర్రెలతో ఉన్న గొర్రెల కాపరిచిత్రపటం, వెలుగుతున్న దీపం చిత్రపటం. ఈ మూడు చిత్రపటాలను క్షుణ్ణంగా పరిశీలించి పోటీ దారులు మూడు ప్రశ్నలకు మూడు జవాబులు చెప్పాలి.
మొదట దుర్జనునికి అవకాశం ఇచ్చారు. దుర్జనుడు తివాచి తోక్కకుండా ఎలా సింహాసనాన్ని చేరుకోవాలో తెలియక చేతులెత్తేశాడు. ఇక విక్రమసేనుడు వంతు వచ్చింది. అతను కొంతసేపు పరిసరాలను పరిశీలించి, కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి వెంటనే తివాచిని గుండ్రంగా చాపలాగా చుట్టుకుంటూ పోయి సింహాసనంపై అధిష్టించాడు. మూడు చిత్రపటాలను బాగా పరిశీలించి మూడు ప్రశ్నలకు వాటి సమాధానాలు అక్కడ ఏర్పాటు చేసిన నల్లబల్లపై క్రింది విధంగా వ్రాశాడు.
1) ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని?
గొర్రె శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు.
2) రాజు ప్రజలను ఎలా చూడాలి?
గొర్రెల కాపరి ఎల్లవేళలా తన గొర్రెలను ఎలా చూసుకుంటాడో అలా.
3) వెలుగుతున్న దీపం క్రింద ఏముంది?
జవాబు; నీడ ఉంది. రాజు కూడా ప్రజలకు నివాసం ఉండేటందుకు నీడ కల్పించాలి.
ఆ జవాబులను న్యాయ నిర్ణేతలు చదివి సంతృప్తి చెంది విక్రమ సేనుని విజేతగా ప్రకటించారు వెంటనే మహారాజు తన కుమార్తె మిర్చి పరిణయం చేశాడు అంతేకాకుండా తాను అన్నమాట ప్రకారంగా చండ ప్రచండ పరమవీరచక్ర బిరుదు ప్రకటించి తన అర్థ రాజ్యాన్ని ఇచ్చి అతనిని పట్టాభి శక్తున్ని చేశాడు.అంతే ప్రజల కరతాల ధ్వనులతో ఆ మైదానం మారు మ్రోగింది.అలి విక్రమ సేనుడు తన తెలివితేటలు ప్రదర్శించి ప్రజల, ప్రభువుల మన్ననలను పొందాడు.s

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి