96వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
భరతుని సైన్యములను గమనించి లక్ష్మణుడు కోపగించుట 

 

"ప్రాణేశ్వరి! ‌ఈ ఫలములు భుజించుము 
ఫలముల గుజ్జుతో ఆమెను తృప్తిపరచెను 
శ్రీరామచంద్రుడు భార్య సమేతుడై 
సమతుల్యప్రదేశమున కూర్చుండగా

అచ్చటికి చేరుచున్న భరతుని సైన్యసవ్వడి 
అశ్వముల కాళీడెక్కల దుమ్ముధూళి 
ఆకాశాన్నితాకుతూ నిలిచిపోయేను 
ఎటు చూసినా దుమ్ముతో కప్పియుండెను 

ఆ మహాసేనల కోలహాల ధ్వనులకు 
పెద్ద పులులు గాండ్రించుచుండెను
వనమున మదపుటేనుగులు భయముతో 
నాలుగుదిశల పరుగులుదీసెను

శ్రీరాముడు ఆ సైన్యధ్వనులను విని
లక్ష్మణా ఏమిటి ఈ ఆశ్చర్యము!
గంభీరమైన మహాధ్వని వినబడుచున్నది 
ఓ సుమిత్రా! అది ఏమిటో గమనించు. 

ఓ సౌమిత్రీ! ఎవరైనా రాజకుమారులు 
ఈ వనమునందు వేటకై వచ్చినారా?
ఏవైనా క్రూరమృగాలు తిరుగుచున్నాయ?
ఒక్కసారి నీవు అటు వెళ్లి జూసిరమ్ము.
 

కామెంట్‌లు