అజరామరమైన ప్రేమకు
ప్రతీకే మా అమ్మ
తాను తినక
మనకైదాచేది అమ్మ
మన చిన్న బొజ్జకు అమ్మే
శ్రీరామరక్ష
మన ఎదుగుదల కోసమై
ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపెనో
ఎంత ధనాన్ని వ్యయం చేసెనో
మన ప్రగతిని చూసి
మురిసిపోయేటి
సహవాసే అమ్మ
మన అల్లరి తనకెంతో ఇష్టము
మనం ఇల్లుపీకిపందిరేసినా
గద్ధించని అమ్మ
మన గర్వరేఖ అమ్మ
ఆట పాటల్లో
ఓడినా ,గెలిచినా
భుజం తట్టునమ్మా
గెలుపు బ్రతుకుమలుపని
గెలుపే అంతిమం కాదన్న
హిత్తైషి మా అమ్మ
అనునిత్యం పూజ్యనీయ
ప్రత్యక్ష దైవమమ్మా
కష్టసుఖంబ్రతుకున
పగలు రాత్రనే నమ్మా
చలించని ధీశాలి
మా అమ్మే మాకు స్ఫూర్తి
బ్రతుకు బాటనెందరో
దోస్తు గాళ్ళు కలిసినా
తొలి నేస్తం అమ్మే
రేపటి తొలి విజయం
తొలి ప్రొద్దు
మా అమ్మే మా అమ్మే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి