వర్షం: - మధుప్రియ - తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా - 9666063963
   

అనగనగా ఒక సీతాపురం గ్రామంలో అన్నాచెల్లెలు ఉండేవాళ్ళు. అన్న పేరు రాము, చెల్లి పేరు వరు. వరుకి వర్షం అంటే చాలా ఇష్టం. 
                  ఒక రోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే భారీ వర్షం. అన్న రాము పరుగెత్తుకుంటూ వెళ్ళి, చెల్లి కోసం గొడుగు పట్టుకుని బస్టాప్ దగ్గర నిలబడ్డాడు. వరుపరుగెత్తుకుంటూ వచ్చావా అన్నా, తడిసిపోయావూ అంది. రాము నవ్వుతూ నువ్వు తడవకుండా ఉంటే చాలు వరు అన్నాడు.
                       ఇంటికి వచ్చి ఇద్దరు గరంగరం బజ్జీలు తింటూ కిటికీలో నుండి వర్షం చూశారు. వరూ  ప్రపంచంలో వర్షంను చూసి సంతోషపడే గొడుగువు నువ్వే అన్నాడు.  ఇద్దరు కిలకిల నవ్వుతూ కిటికిలోంచి వర్షాన్ని చూస్తూ అట్లానే నిద్రపోయారు.
నీతి: అన్నకు చెల్లి మీద ప్రేమ సముద్రమంతా ఇష్టం.
పై "వర్షం" కథ నా స్వీరచనా ఎలాంటి అనువాదం కానీ అనుసరణ గానీ కాదని, ఇతర పత్రికలకు పంపడం లేదని హామీ ఇస్తున్నాను.
కామెంట్‌లు