సూర్యుడు: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


ఇంటి నిట్టాడు 
గగనంమంత కిటికీ 
నాన్న
జీవనగీతం సారం,సౌందర్యం
నిను నడిపించే దారిదీపం.

తరం ఏదైనా
కాలం నడకెత్తిన అంతరంగాన 
అమ్మ తినిపించే 
బువ్వ కుండ అద్దం అతడే
బతుకు రుధిర కావ్యం

ఎన్నో భాషల ఎన్నెన్నో తీర్ల కవితలు 
కానీ
ఒడుపుగ రాసే కుటుంబ కవి,
కాపలా రవి   
ప్రపంచాన ఒక్కడై 
దివారాత్రులు వెలిగే సూర్యుడు నాన్న

కామెంట్‌లు