నిజాల నిప్పు కణికలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

ఆశయాల సాధనలో 
ఎన్నెన్నో కష్టాలు 
ఎదుర్కుంటే ధైర్యంగా 
పాదాక్రాంతము విజయాలు 

గుండెల్లో అనుమానము 
పరికించగ పెనుభూతము 
ఆదిలోనే తరమాలి 
ఆమడ దూరముండాలి 

జీవిత ప్రయాణంలో 
మనోధైర్యం ఆయుధము 
కష్టాల సమయంలో 
బలమైన పర్వతము 

ఉంటేనే సింగంలా 
బ్రతకగలం లోకంలో 
లేకుంటే ఏమాత్రము 
మనలేం జీవితంలో 

కామెంట్‌లు