అక్కయ్య చెప్పిన మెళకువలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

కోల్పోతే మనోధైర్యము 
ఏదీ సాధించలేము 
ఆవహిస్తే పిరికితనము
అభివృద్ధికి ఆటంకము 

ఉరుకులేసే ఉత్సాహము 
ఇస్తుంది  పునరుజ్జీవము 
మితిలేని నిరుత్సాహము 
పోగొట్టును సంతోషము 

ఉంటేనే ఆరోగ్యము 
బ్రతుకులో మహా భాగ్యము 
కాపాడుకొనుట ముఖ్యము 
లేదంటే ఇల నరకము 

పాటించాలి మెళకువలు 
బాగుపడును జీవితాలు 
లోపిస్తే క్రమశిక్షణ
ఉండదు బ్రతుకులకు రక్షణ 

కామెంట్‌లు