శ్రేష్టమైనది జ్ఞానము :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

ఘన సంపద జ్ఞానము 
అక్షరాల సత్యము 
పెంచుకున్న లాభము 
జీవితాన క్షేమము 

ఖరీదైన హేమము 
శ్రేష్టమైన ముత్యము 
ఆర్జించుము జ్ఞానము 
తెస్తుంది గౌరవము 

జ్ఞానంతో సమానము 
జగతిలో లేదు లేదు
అదెంతో ఉన్నతము 
దాని సాటి కానరాదు 

అంతులేని జ్ఞానము 
అందరికి అవసరము 
లేకపోతే బ్రతుకులు 
అత్యంత దారుణము 

కామెంట్‌లు