హలో పిల్లలు! ఈ బిళ్ళ గన్నేరు పూలు శివుడికి ప్రీతిపాత్రం. ఈ పువ్వులు ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. ఎక్కవ శ్రద్ధ పెట్టకపోయినా చక్కగా బతికి బట్ట గట్టటమే కాదు ముచ్చటైన పువ్వులనిస్తాయి. ఇందులో ఇంకా శంకు పువ్వులు, బంతి రెక్కలు, గులాబీలు, సపోటా గింజలు వాడాను. అన్నింటికన్నా ముఖ్యంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేశాను. వెంటిలేటర్ (ప్రాణ ప్రమాద పరిస్థితిలో ఆసుపత్రిలో ఉండే మిషన్) లో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాను. దీపావళికి దీపాలు పెట్టాలని తీసుకు వెళుతున్న అమ్మాయిని వెనక నుండే చిత్రించాను. ఇప్పటి వరకు మా అమ్మాయిల ముఖారవిందాల్ని చూపించాను. కానీ ఈ అమ్మాయి తన ముఖం చూపించనని మొండి పట్టు పడుతోంది. అందుకే ఆమెకు తెలియకుండా వెనక నుండి ఫోటో తీసేసి మీకు చూపిస్తున్నాను. ఈ చెట్టు “అపో సైనేసి” కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం “కథురాంధస్ రోజేయుస్”. గులాబీ రంగులోనూ, తెలుపు రంగులోనూ కనిపిస్తాయి. మా కుండీలలో చాలా చెట్లున్నాయి. నేనిలా బొమ్మలు, అమ్మాయిలను చేసేస్తుంటాను. దీని నుంచి క్యాన్సర్ మందులు తయారు చేస్తున్నారు. వీటిని ‘వింకారోజియా’ అని కూడా పిలుస్తారు.
వెంటిలేటర్ వేస్ట్ గా వచ్చే ప్లాస్టిక్ మూతలను శరీరానికి, వాడేశాను. జుట్టు కోసం సపోటా గింజల్ని అమర్చాను. చేతిలో దీపాన్ని పెట్టాను. దీపంలో గునుగు పువ్వును పెట్టాను. బంతి రెక్కలతో బ్లౌజును కుట్టి తొడిగాను. పావడాను కూడా బిళ్ళ గన్నేరు, శంకు పూలు అందంగా కుట్టాను. గులాబీ రెక్కలు, శంకు పూలు అక్కడక్కడా అమర్చి కుట్టాను. పావడా జాకెట్ వేసుకున్న అమ్మాయి అందాన్ని చూడండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి