అల్లూరి వ్యాసరచన విజేతలకు బహుమతి ప్రదానం
 

వికాస తరంగిణి రాజాం శాఖ ఆధ్వర్యంలో ఇటీవల  అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రపై  నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు బహుమతులను అందజేసామని సంస్థ ప్రతినిధులు టి.టి.వి.రమణమూర్తి, వాకచర్ల పైడిరాజులు తెలిపారు. రాజాం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం జరిగింది. శ్రీ విజయ కోదండరామ ఆశ్రమం అధ్యక్షులు టి.టి.వి. రమణమూర్తి మాట్లాడుతూ పిల్లలలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాలను పెంపొందించుటకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, ఒక ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు వివరాలు:-
ప్రైవేట్ పాఠశాలల విభాగం పదవ తరగతి పోటీల్లో 
డి. వేదవర్షిత, సన్ స్కూల్,
కె.సుమశ్రీ, సన్ స్కూల్,
యండమూరి అక్షిత, సన్ స్కూల్ లకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించగా, గొర్లె లోహిత శ్రీ సంతోషి స్కూల్ కు కన్సోలేషన్ బహుమతి లభించింది.
ప్రైవేట్ స్కూలు విభాగం ఎనిమిది తొమ్మిది తరగతుల పోటీల్లో మాన్సి యాదవ్ జ్ఞాన జ్యోతి విద్యాలయం, కోరాడ సాయి సంజన, విశ్వశాంతి విద్యాలయం, ఎంపల జాహ్నవి సన్ స్కూల్ లకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించగా
డి.జ్యోత్స్న జ్ఞాన జ్యోతి విద్యాలయం,
జోగ అసిస్ జయరాం సన్ స్కూల్ లకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి 
ప్రభుత్వ పాఠశాల విభాగం పదవ తరగతి పోటీల్లో 
వావిలపల్లి ఝాన్సీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డోలపేట, దాసరి మానస బాలికల ఉన్నత పాఠశాల, సారధి, బెవర పవిత్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డోలపేట లు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించగా, సి.హెచ్.కృపారాణి బాలికల ఉన్నత పాఠశాల సారథికి కన్సోలేషన్ బహుమతి లభించింది. ప్రభుత్వ పాఠశాల 8,9 తరగతుల విభాగంలో 
నడగాన ధనలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొద్దూరు, యడ్ల ధరణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందరాడ
గుంటముక్కల యమున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారధిలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించగా మంతిన మోహిత్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుబాకకు కన్సోలేషన్ బహుమతి లభించింది. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గడే అప్పలనాయుడు, కర్రి కన్నబాబు, కుదమ తిరుమలరావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు అమనాన నీలకంఠం, అబ్బులు, పాలవలస రాంబాబు, మహంతి సత్యనారాయణ, గట్టి పాపారావు, ఆర్.వి.జె. నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు