యశోదమ్మ లోకం: - - యామిజాల జగదీశ్


 నా చిన్నారి కృష్ణా… మాతృత్వపు పసిడి బంగారానివి! 
నన్ను తాకి మురిపించే వెన్నెల కాంతివి!
నా మనసులో దాచలేని బంగారు నిధివి! 
నీ బుజ్జి బుగ్గలపై ఒక ముద్దు పెట్టినప్పుడు, ఈ ఆకాశం… ఈ భూలోకం…అన్నీ తానై పోయి నన్ను నేను మరచిపోతాను! 
నెయ్యి దీపపు మృదువైన వెలుగు నీ నుదుటిని నిమురుతున్నప్పుడు,ఆ చిన్ని వేళ్లతో నన్ను తాకే ఆ క్షణం ఒక పవిత్ర మంత్రంలా నా హృదయమం తా తియ్యదనంతో నిండిపోతుంది!
ఇక్కడ…నీ చిరునవ్వులో వికసించే ఆ పాల తావి అమ్మ ప్రాణంలో కురిసే అంతులేని పుణ్యాల వాన! 
యుగాలు దాటి వచ్చిన ఈ వాత్సల్య మహాసముద్రం నీ పసిచేతుల్లో వచ్చి నిలిచినప్పుడు, నా హృదయమే నేలపై వికసించిన స్వర్గంలా మారిపోతుంది! మాయల చిన్నారి నెమలీక…నా ముద్దుల కృష్ణా…నా చిన్ని కృష్ణా…నీ చిరునవ్వే నా ప్రపంచం!
కామెంట్‌లు