షోలాపూర్ లో సోమన్న పుస్తకావిష్కరణ


 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన "చిన్ననాటి స్నేహం" పుస్తకావిష్కరణ తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక్ గ్రంథాలయం,షోలాపూర్, మహారాష్ట్రలో ఘనంగా జరిగింది.మేయర్ శ్రీ వినాయక్ కొడియల్,అడ్వకేట్ శ్రీ శ్రీనివాస్ క్యాతం,ప్రముఖ వ్యాపారవేత్త  సంస్థ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కమటం,కార్యదర్శి శ్రీ తిప్పన్న గనేరిల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించి, వారి తెలుగు సాహితీ కృషిని గొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ సత్యనారాయణ,విజయ్,పద్య కవి ఓగన్న, యాంకర్ రేణుకా బుధారం, నరేంద్ర గుండెలి పాత్రికేయ మిత్రులుపాల్గొన్నారు. బహు గ్రంథకర్త,సన్మాన గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ  అభినందించారు.
కామెంట్‌లు