సామెత-318:ఇల్లు పీకి పందిరేసినట్టు
"అవ్వా! కొంతమందిరి శానా శానా గమ్మతిగుంటరు. 'ఒకలు శెప్పేది యినరు-గాళ్ళ వొంటనన్న సరైన బుద్ధి పుట్టదు'.గాళ్లింక మానరా అవ్వా!"
"ఎవలు శెల్లే! శెప్పితే యిననోళ్ళు.గీ నడ్మల శానా మందిరి గట్లనే తయారైండ్రు తీ! ఎవల్ని అనేతట్టుంది.గట్ల గాదు గిట్లని మంచి శెబర శెప్పేటట్టుందా?మనం సుత గంతో గింతో ఎన్కటోళ్ళం గన్క మన పెద్దోళ్ళు శెప్పింది యిన్నం."
"అవునవ్వా! శిన్నపోరలైతే నాల్గు బీకి గిట్ల గాదు గట్ల అని శెప్తం.పెద్దోళ్ళకి ఏం శెప్తం.అన్నట్టు మర్శినక్క గీ నడ్మల మా పెద్దమ్మ మన్వరాలు యిద్దరు పిల్లగాండ్లని తోల్కోని శాన్నాల్లయింది అమ్మమ్మని సూడకని, సూట్టానికొచ్చింది. నేను సుత గా పొల్లని దాని పిల్లల్ని సూద్దమని పొయినవ్వా. వామ్మో! వామ్మో! గాల్లేం పిల్లలవ్వో.పిల్ల రాచ్చసులు."
"అవును శెల్లే!గీ కాలం పొల్లగాండ్లకి గావురం ఎక్వైంది.ఏమి లొల్లి? ఏమి లొల్లి పో!"
"అవునవ్వా! గదే శెప్పబోతున్న.పెద్దమ్మ గంత శాతవ్వకబొయినా యిల్లు సుబ్బరంగ ఏడి వత్తువు ఆడ బెట్కొని అద్దంల మెరిపిత్తది. గస్మంటి అద్దంల మెర్శిన యిల్లును యిల్లు ఆల్కం లేకుండ శేసిర్రు. పిలాట్టిక్ కుర్శీలు రొండు మూడు యిరగ్గొట్టిర్రు. పెద్దమ్మ కొడ్కు పట్నం నించి తెప్పిచ్చిన పొడుగు పొడుగు కుర్శీలు,గవే అవ్వా దూది కంటే మెత్తగ లోపలంత బూరు బూరుగ వుంటయి సూడు యాదికొత్తల్లే.గయ్యిటిని శేతుల్ల రాస్కుంటమని తీస్కున్న పెన్నులు,పెనిసీళ్ళ తోటి యిరణ్య కశ్పిన్ని నర్సిమ్మ సామి పొట్ట శీల్శి పేగులు ఎల్ల దీత్తడు సూడు గా లెక్కన లోపల్ది పీకి ఇల్లంత పడేశిర్రు. పెద్దమ్మ మొకం సూడాలె మింగలేక కక్కలేక అన్నట్టుంది. ఇగ్గో అవ్వా! గంత శెడుగు పన్లు శేత్తున్నా గాళ్ళని పొల్ల ఒక్క మాట సుత అనుడు లేదు.పైంగ మాయింట్ల సుత గిట్లనే శేత్తరు అమ్మమ్మా అనబట్టింది.గదేం గావురం,గదేం పెంపకం అవ్వా!"
" ఇగ్గో శెల్లే! "ఇల్లు పీకి పందిరేసుడంటే ' గిదే మరి.గిప్పటి అమ్మ నాయినల్ని సుత అనేతట్టు లేదు.ఎంత గావురం శేత్తె గంత గొప్పగ పెంచుతున్నమని అనుకుంటుర్రు.గా శిన్నపొల్లగాండ్లకేం దెలుత్తది.గద్దియ్యక పోతే సేశేది మంచిపనేమో అనుకుంటరు."
"అవునవ్వా! గట్ల శిన్నప్పన్నించి గావురం సేశే ఇత్తారి బావని పురాగ శెడగొట్టిర్రు.గా బావ వొద్దన్న పని వాలాయిచ్చి శేత్తడు. ఎన్కటి యిల్లు. గందులకి బోతే పెద్ద పెద్దోళ్ళ బంగులాకి బోతున్నట్టుండేది.గస్మంటి యింట్లె తల్పులున్న తాన కిటికీలు,కిటికీలు ఉన్న తాన తల్పులు,లేనితాన గోడలు పలగ్గొట్టుడు. సక్కదనంగ ఉన్న యింటిని అంక శెండాలం జేసిండవ్వా! ఓ అందం,సందం లేకుంటయ్యింది.ఆ కాడికి మావఁ,అత్త నెత్తి నోరు గొట్కొని 'వొద్దురా అయ్యా!' అని బతిలాడిర్రట.ఇంటెనా..? సూడ సక్కని యింటిని పాడు పాడు సేశిండవ్వా!"
"అగ్గో గస్మంటి పనిని సుత గిట్ల "ఇల్లు పీకి పందిరేసుడనే సామెత్తో" పోలుత్తరు శెల్లే.గా శిన్న పొల్లగాండ్లంటే తెల్వక అన్కోవచ్చు.గీడికేమయ్యింది శెప్పు.గిట్ల మంచిగున్న ఆటిని శెడగొట్టే తల్తిక్క పన్లు తప్ప."
"అవునవ్వా! మాగ శెప్పినవ్!" ఇల్లు పీకి పందిరేసుడంటే" అర్తమయింది.
గదండీ సంగతి " "ఇల్లు పీకి పందిరి వెయ్యడం "అంటే గిదే మరి. మంచిగున్న దాన్ని శెడగొట్టుకోడం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి