జరీ కుట్టిన కాలి జోళ్ళు
పలురుచుల చిరుతిళ్ళు
జాతరలో భలే సందళ్ళు!!
రంగులరాట్నం తిరిగింది
అందున గుఱ్ఱం ఎగిరింది
స్వారీ భలేగ నచ్చింది
నాని ముఖం వెలిగింది!!
రంగురంగుల బుడగలు
గురి పెట్టి తుపాకులు
పిల్లలు పేల్చిరి తూటాలు
బహుమతి పొందిరి బాలలు!!
రిబ్బను గాజులు చూసిన చిన్ని
అమ్మను అడిగితే కొన్నది కొన్ని
రైలుబొమ్మకై ఏడ్చిన బన్ని
తీసుకెళ్ళాడు నాన్న తన్ని!!
పీచు మిఠాయి బాగుంది
జిలేబిని చూస్తే నోరూరింది
చిట్టి ఇంటికి రానంది
అమ్మ మారం చేయొద్దoది!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి