నేటి భారతంలో......!: - " కావ్యసుధ "


అమ్మా ! ఒక్క బిడ్డ కూడా 
ఆకలితో పడుకోవద్దు !
రైతన్న పండించిన పంటకు గౌరవం
కూలీకి కడుపునిండా కూడు 
ఆకలి లేని భారతం

అందరికీ చదువు
అమ్మా ! ప్రతి బిడ్డ చేతిలో 
పుస్తకం ఉండాలి 
పేద గొప్ప తేడా లేకుండా
గ్రామంలోని చివరి ఇంటి 
బిడ్డకూ ఐఐటి కల నెరవేరాలి 

ఆరోగ్యకరమైన భారతం.
అమ్మా ! ప్రతి ఇంటికి ఆరోగ్యమివ్వు.
డబ్బు లేక చికిత్స 
ఆగిపోని రోజు రావాలి
గ్రామములోనే మంచి వైద్యం అందాలి.

స్త్రీకి భద్రత -  గౌరవం
అమ్మా ! నీ బిడ్డలందరూ
అర్ధరాత్రి 12 గంటలకి కూడా 
నిర్భయంగా తిరిగేలా చేయి
ఇల్లాలు రాణిగా 
ఉద్యోగిని శక్తిగా 
శాస్త్రవేత్తగా ఎదిగే భారతం.

పచ్చని భారతం
అమ్మా ! ఈ నదులు ,చెట్లు
కాలి శుభ్రంగా ఉండేలా వరమివ్వు 
వచ్చే తరానికి మనం 
వదిలేది కాలుష్యం కాదు
ప్రకృతి

రైతు కన్నీరు తుడిచే రోజు రావాలి.
విద్యార్థుల కలలు ఫలించే రోజు రావాలి.
సైన్యకుడు సరిహద్దులో 
నిశ్చింతగా ఉండే రోజు రావాలి.
జై హింద్ ! అనే నినాదం 
ప్రపంచమంతా....... మారుమోగాలి. 

స్వతంత్రం అంటే.....
జెండా ఎగరవేయడం కాదు 
ప్రతి పౌరుడు గర్వంగా....
తలెత్తుకునేలా బతకడం.
=============================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
" సాహితీ శిరోమణి "
 హైదరాబాద్
 9247313488
కామెంట్‌లు