తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ , ఉషోదయ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నాగావళి కవితా తరంగాలు అనే కార్యక్రమాన్ని ముందస్తు తెలుగు భాషా దినోత్సవం సంబరాలలో భాగంగా జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నాడు జిల్లా శాఖా గ్రంథాలయం, శ్రీకాకుళం నందు అత్యంత ఘనంగా నిర్వహించారు. సారవకోట గ్రామానికి చెందిన కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) "తెలుగు, భాషలందు భేష్" అనే కవితా గానం చేసినందుకు మాతృ భాష సేవా ప్రజల్విత పుర,స్కారాన్ని జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని, దుశ్శాలువతో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. యు.వి.రత్నం, ఉషోదయ ఫౌండేషన్ అంతర్జాతీయ డైరెక్టర్ & ప్రోగ్రాం కన్వీనర్ ధనాశి ఉషారాణి గార్లు సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జి.ఇందిరా ప్రసాదరావు రిటైర్డ్ అడ్వకేట్, డాక్టర్ పైడి సింధూర, సోడవరం ఈశ్వరరావు సంఘ సేవకులు, గుత్తావిల్లి శ్రీనివాసరావు రచయిత, కవులు, ప్రముఖులు, తదితరులు పాల్గొని కవి ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)ను అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి