ఎవడు చూడమన్నాడు:- కొత్త విరిత


 మనుషులకు ఉన్న గొప్ప టాలెంట్ ఏంటో తెలుసా?
తమకు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా వేలు పెట్టి కేలుకోవటం.ఎవరో ఒకరు స్టేటస్ లో స్టోరీ పెట్టారు.వాళ్ళేమో
చూడమని పిలవలేదు.
కానీ చూస్తారు.వీడియో పెట్టారు.వాళ్ల కోసం ప్రత్యేకంగా తీయలేదు.కానీ మూడు సార్లు మొఖం ముడుచుకొని చూస్తారు,చూసిన తర్వాత మొదలవుతుంది అసలు కార్యక్రమం…
“అబ్బా! ఎంత చూపిస్తున్నారు!”
“వీళ్లకి ఇంత సీన్ అవసరమా?”
“ఎక్కడికి వెళ్లారో చూశావా?”
“ఏం కొన్నారో చూశావా?”
“ఎవరితో ఉన్నారో చూశావా?”
మీకు నచ్చకపోతే చూడకండి కదా!వాళ్ల జీవితం మీకు నచ్చేలా నడపాల్సిన అవసరం వాళ్లకు లేదు.ఎవరో సంతోషంగా ఉన్నారని చూసి మీకు అసూయ వస్తే,అది వాళ్ల సమస్య కాదు…మీ మనసులో ఉన్న కొరతకు వచ్చిన నోటిఫికేషన్.
ఎవరో ప్రయాణం చేస్తే “షో ఆఫ్.”
ఎవరో కొత్తది కొంటే “అవసరమా?”
ఎవరో సంతోషంగా ఉంటే
“నటన.”
ఎవరో ఎదిగితే
“అదృష్టం.”
మరీ ముఖ్యంగా…
స్టోరీ చూసి గోస్సిప్స్ చేయడం,ఫోటో చూసి తీర్పు చెప్పడం,వీడియో చూసి అసూయ పడటం…ఇవన్నీ చేసి చివరికి “నాకు వాళ్లంటే అసలు పట్టదు,నాకు అవసరం లేదు” అంటారు.
అవును,పట్టదు...పాపం అందుకే కదా వాళ్ల స్టోరీకి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ ముందుగా మీరే చూస్తారు!నిజానికి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ ఒక చిన్న సలహా అవసరం,చూడాలనిపిస్తే చూడండి.నచ్చితే మెచ్చుకోండి.నచ్చకపోతే స్కిప్ చేయండి.
అసూయ వస్తే మీ మనసు లోనే చూసుకోండి.
ఎందుకంటే…వాళ్లు స్టోరీ పెట్టింది తమ జీవితం గురించి మీరు రివ్యూ రాయమని కాదు!చివరగా ఒక్కటే ప్రశ్న,అంత నొప్పిగా ఉంటే అసలు
“ఎవడు చూడమన్నాడు?”
=============================
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wah... perfectly said
అజ్ఞాత చెప్పారు…
Yes correct ga chepparu
అజ్ఞాత చెప్పారు…
Bagundi
అజ్ఞాత చెప్పారు…
😆