తెలుగు వెలుగు: - -మీసాల సుధాకర్ పిజిటి-తెలుగు


అమ్మ నోటి నుంచి వచ్చిన తొలి మాటలోనే
అమృతంలా జారేది తెలుగు.
ఆప్యాయంగా మాట్లాడే ప్రతి మాటలో
అనురాగంగా వినిపించేది తెలుగు.

అక్షరం అక్షరంలో అందంగా,
పదం పదంలో పరిమళంగా,
పాటల్లో మాధుర్యంగా,
పద్యాల్లో సొగసుగా మెరిసేది తెలుగు!

నన్నయ కలంలో నడక నేర్చుకుని,
తిక్కన కవితల్లో తేజంగా,
ఎర్రన భావాల్లో వెలుగుగా,
కవుల మనసుల్లో ఎప్పటికీ నిలిచింది తెలుగు.

శ్రీకృష్ణదేవరాయల కీర్తిలో
“దేశభాషలందు తెలుగు లెస్స”గా
ప్రపంచం ముందే వెలిగిన
మన గొప్ప భాష తెలుగు.

నాదంగా, పాటగా, భావంగా,
జ్ఞానంగా, విజ్ఞానంగా,
మన సంస్కృతికి ఊపిరిగా నిలిచిన
మధురమైన భాష తెలుగు.

అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష,
తరతరాలకు అందించాల్సిన మన సంపద;
తెలుగు మాట్లాడటం మన గర్వం,
తెలుగును కాపాడటం మన బాధ్యత.

తెలుగు వెలుగు ఎప్పటికీ ఆరిపోక,
తెలుగు తల్లి తలవంచక,
ప్రతి మనసులో తెలుగు మార్మోగాలి.
ప్రపంచమంతా తెలుగు వైభవంతో వెలిగిపోవాలి.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు


కామెంట్‌లు