నేటి సమాజంలో బాధ్యత ముసుగులో నిర్లక్ష్య ధోరణి ...
పైకి చూపే ప్రేమేమో పగటి వేషంలా వెలిగిపోతోంది...
లోపల దాగున్న నిర్లక్ష్యం నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తోంది...
నువ్వంటేనా సొంతం అంటూనే రోడ్డుపై పడి ఉంటే వదిలేస్తారు...
ఫోన్లలో ఫోటోలు తీస్తూ బాధ్యతను సోషల్ మీడియాకు అప్పగిస్తారు...
ఇంటి ముసలి ప్రాణాన్ని ముద్దుగా 'అమ్మా' అని పిలుస్తారు...
కానీ వాళ్ళు ఒంటరిగా ఏడుస్తుంటే చూసీచూడనట్టు ఉంటారు...
సమాజం బాగుండాలని వేదికలపై ఉపన్యాసాలు ఇస్తారు...
కానీ పక్కవాడి ఆకలిని మాత్రం చాలా తేలిగ్గా మర్చిపోతారు...
పిల్లలకు ఖరీదైన చదువులు కొనిచ్చి బాధ్యత తీరిందంటారు...
వాళ్ళు ఒంటరితనంతో నలుగుతుంటే కాలేజీ ఫీజుతో సరిపెడతారు...
ప్రకృతిని ప్రేమిస్తామంటూ పర్యావరణ దినోత్సవాలు చేస్తారు...
మరుసటి రోజే ప్లాస్టిక్ కుప్పలతో నేలతల్లిని ముంచేస్తారు...
ఈ బాధ్యత అంతా ఒక అందమైన అబద్ధాల రంగుల వల...
ప్రేమ పేరిట మనం చేస్తున్న నిర్లక్ష్యపు నాటకమిలా...
చట్టాలు ధర్మాలు అంటూ మాటల కోటలు కడతారు...
సహాయం చేయాల్సి వచ్చేసరికి ముఖాలు చాటేస్తారు...
ప్రేమగా చూస్తున్నట్టే నటిస్తూ వెన్నుపోటు పొడుస్తోంది ఈ కాలం...
బాధ్యత లేని ఈ నకిలీ ప్రేమ సమాజానికి ఒక పెద్ద శాపం...
ఇకనైనా ముసుగులు తీసి నిజమైన ఆత్మీయతను పంచుకోండి...
మాటల నిర్లక్ష్యం వీడి చేతల్లో బాధ్యతను చూపించండి...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి