వాసు తరగతులో మొదటి ర్యాంకు విద్యార్థి. సోము చదువులో చాలా వెనుకబడి ఉండేవాడు. తన తరగతిలోని అల్లరి చిల్లరి బృందంతో రోజు అల్లరి చిల్లరి ఆటగాడుతూ సమయం వృధా చేస్తాడు కానీ, చదువు గురించి అస్సలు పట్టించుకోడు. సోము తన మిత్ర బదంతో కలిసి అప్పుడప్పుడు వాసును హేళన చేస్తూ ఉండేవాడు. వాసు ప్రతిరోజు ఇంటి నుండి బడికి బయలుదేరేటప్పుడు వేగంగా నడుచుకుంటూ వెళ్లేవాడు. ఇది సోముకు నవ్వు తెప్పించేది.
సోము కూడా వేగంగా నడవడం ప్రారంభించి, రోజు వాసూను దాటి వెళ్లడానికి ప్రయత్నించేవాడు. నడకలో వాసు వేగాన్ని అధిగమించి, వాసవిని చూసి, పగలబడి నవ్వుతూ వెళ్లేవాడు. వాసు ఇవేవీ పట్టించుకోకపోయేవాడు. ఈ విషయం ఒకరోజు సిరికి తెలిసింది. సిరి వాసూతో "వాసూ! సోము నిన్ను రోజు నడకలో మించిపోయి, హేళన చేస్తూ పగలబడి నవ్వుతున్నాడు. నువ్వు మరికొంత వేగాన్ని పెంచి, సోమూను దాటలేవా? అప్పుడు వారిని చూసి నువ్వు నవ్వవచ్చు కదా!" అప్పుడు వాసు సిరితో ఇలా అన్నాడు. "ఏడ్చాడు వాడు! నడకలో నన్ను అధిగమించి, వాడు ఉద్ధరించేది ఏమైనా ఉందా? భవిష్యత్తుకు అది పనికి వస్తుందా? చదువులో నన్ను అధిగమించమను. నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోమను. అప్పుడు వాడు గెలిచినట్లు. నేను ప్రతిరోజు వేగంగా నడుచుకుంటూ వెళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది వ్యాయామం కోసం. రెండవది తొందరగా బడికి వెళ్లితే ఆరోజు పరీక్షకు సంబంధించినవి పాఠాలు మరొకసారి చదువుకోవడానికి. మరి నాకంటే ముందుకు వెళ్లి సోము ఏమి ఉద్ధరిస్తున్నాడు? ఇవన్నీ నేను పట్టించుకోను." ఉన్నాడు వాసు. ఇదంతా వెనుకబడి వింటున్న గిరి ఈ విషయం సోముకు పూసగుచ్చినట్లు చెప్పాడు. సోము సిగ్గుతో తలదించుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి