విజయవాడలో ఘనంగా ముందస్తు తెలుగు భాష సేవా రత్నావళి పురస్కారాలు


 తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. యు . వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా . ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలో ముందస్తు తెలుగు భాష దినోత్సవం సంబరాలు సినీ సంగీత విభావరి కార్యక్రమం హనుమంతరాయ గ్రంథాలయo గాంధీ నగర్ విజయవాడలో  మధ్యాహ్నం  12గంటలు నుంచి 5 గంటలు మధ్యలో ఆగష్టు 2 తేదీ  విభిన్న రంగాల్లో సేవలు చేసిన కవులు కళాకారులు సాహితీ సంస్థ అధినేతలకు భాష ప్రేమికులకు తెలుగు భాష సేవా రత్నావళి పురస్కారంను నిర్వాహకులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా డా. జీ మురళీ కృష్ణ రిటైడ్  అడిషనల్ యస్పీ మరియు డా.వి. డి. యస్ ప్రసాద్ రిటైర్డ్ జ్యుడీషియల్  అధికారి దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ స్కూల్ కరెస్పాండెంట్ జి.తిరుపతిరావు రిటైడ్ ఆర్ పి ఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మొదలగు వారు  అవార్డును ప్రదానం చేయడము  జరిగింది. గాయనీ గాయకులుతో  సినీ సంగీత విభావరి కార్యక్రమంను కనులు విందుగా వైభవంగా జరిగిందని నిర్వాహకులు డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా.ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు.
కామెంట్‌లు