త్యాగరాజు రామదర్శనం : -.డాక్టర్ ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ


 సంగీత జగద్గురువు త్యాగరాజు వాగ్గేయకారుడు ఆయన సంస్కృత ఆంధ్ర సాహిత్యాన్ని మధించిన భావకుడు ఆయన కృతులలో కవితా కమనీయత  విశేషాలను ఇందులో వివరించటం జరిగింది శ్రీ శాస్త్రి గారి తండ్రి కీర్తిశేషులు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు త్యాగరాజ చరిత్రను హరికథ గానంగా చేసి తరించారు ఆయన ప్రభావంతో  తిరువయ్యూర్ సందర్శించి అక్కడి విశేషాలతో త్యాగయ్య జీవిత ఘట్టాల్ని సోదాహరణంగా వివరించుట జరిగింది.ములుకుట్ల వంశంలోని పూర్వీకులంతాశ్రీమద్రామాయణమే శరణ్యంగా జీవనోపాధి జీవనోపాధిగాతీసుకుని ప్రచారం చేశారు. సంసారులైనవారికి భక్తిజ్ఞానమోక్షాలు సాధ్యమని నిరూపించారు త్యాగయ్య. ఆయన కీర్తనల తోనే సంగీత కచేరీలు సాగుతాయి. త్యాగయ్య  అరవంలో త్యాగరాజయ్య అని సంతకం చేసేవారు.మణిరంగు రాగంలో"నీకు సరి ఎవరురా" అనే కృతిలో ఇలా చెప్పారు" పంచనదపురమున జనించిన నాపాపముల తీర్చిన ప్రణతార్తిహరుడవు" కేవలం రెండు ఇళ్లలోనే ఆయన ఉంఛవృత్తి చేశాడు.కర్ణాటక సంగీత ప్రపంచంలో శ్యామ శాస్త్రి త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు త్రిమూర్తులు వీరిలో శ్యామశాస్త్రి దేవి ఉపాసకులు ఆయన ఇష్ట దైవము కామాక్షి శ్యామ కృష్ణ సోదరి అని ఆయన రాశారు రెండవ వాడైనా త్యాగయ్య 96 కోట్ల రామ నామము జపించి సర్వదేవతాపరముగా కృతులను రచించాడు త్యాగరాజనుత అనే ముద్రతో ఉంటాయి ఆఖరివాడైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్య ఉపాసకులు నవగ్రహ కీర్తనలు నవావరణ కీర్తనలు రచించారు శ్యామశాస్త్రి 1762లో త్యాగరాజు 1767 లో ముత్తుస్వామి 1772లో పుట్టారు శ్రీ త్యాగరాజ స్వామి శంభు నారద గణపతి ఆంజనేయ వాల్మీకి అంశలతో జన్మించారని భక్తుల అభిప్రాయము ఆయన కృతులకు త్యాగబ్రహ్మోపనిషత్తు అని పేరు ఉంది ఆయన ముఖ్య శిష్యుడు వాలాజా పేట వెంకటరమణ భాగవతులు🌷
కామెంట్‌లు