నేటివిటీ.....!?: -డా ప్రతాప్ కౌటిళ్యా.


నేటి వీటిని వీడకండి 
నేటి వీటిని ఆహ్వానించండి 
చివరి వరకు చివరికి తాజాగా ఉండేది 
జీవితాన్ని తాజాగా ఉంచేది అదే...!!

రూపాంతరం చెందిన రంగురంగుల సీతాకోచిలుకవే నీవు. 
అంతకుముందు నీవు ఒక బొంత పురుగువు. నీవు. 

బాల్యం ఒక నేటివిటీ 
చదువు ఒక నేటివిటీ
యవ్వనం ఒక నేటివిటీ 
అమ్మ ఒక నేటివిటీ 
నాన్న ఒక నేటివిటీ 
అక్క ఒక నేటివిటీ 
చెల్లి ఒక నేటివిటీ
స్నేహితులు ఒక నేటివిటీ

మళ్లీ మళ్లీ రానీ ఈ నేటివిటీ 
ఒక వసంతం ఒక స్వర్గం 
ఒక నిజం ఒక జీవిత బీజం. 

పల్లే ఒక నేటివిటీ 
ప్రకృతి ఒక నేటివిటీ 
చెరువు ఒక నేటివిటీ 
పంట ఒక నేటివిటీ 
పాడి ఒక నేటివిటీ 
ఇల్లు ఒక నేటివిటీ 

సర్వం ఒక స్వర్గం 
ఒక స్వప్నం ఒక నిజం 

చివరికి చివరి వరకు 
ఒక తాజా జ్ఞాపకం ఇదే 
నేటివిటీని వీడకండి 
నేటి వీటిని ఆహ్వానించండి..!!

రూపాంతరం చెందిన రంగురంగుల సీతాకోచిలుకవు నీవే 
అంతకుముందు ఒక బొంత పురుగువు నీవే....!!!?
===============================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు