మేల్కొనండి : తమిళ రచనకు అనుసృజన - యామిజాల జగదీశ్


 నా గదిలో మంచంపై పడుకుని ఆలోచిస్తున్నాను.
"జీవితంలో విజయం సాధించడానికి అనేక రహస్య మార్గాలు ఉన్నాయా?" అని.
అంతలో పకపకా నవ్విన నవ్వు వినిపించింది.
నా గదిలోని వస్తువులన్నీ పడి పడి నవ్వుతున్నాయి.
"మమ్మల్ని చెప్పమంటావా?" అని అడిగాయి.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 
"సరే, చెప్పండి చూద్దాం" అన్నాను.
ఫ్యాన్ ఇలా చెప్పింది: "ప్రశాంతంగా ఉండు"
పైకప్పు ఇలా చెప్పింది: "లక్ష్యాన్ని ఉన్నతంగా ఉంచుకో"
కిటికీ ఇలా చెప్పింది: "ప్రపంచాన్ని చూడు"
గడియారం ఇలా చెప్పింది: "ప్రతి నిమిషం విలువైనదే"
అద్దం ఇలా చెప్పింది: "ఏదైనా చేసే ముందు ఆలోచించు"
క్యాలెండర్ ఇలా చెప్పింది: "ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండు"
తలుపు ఇలా చెప్పింది: "నీ లక్ష్యాల కోసం గట్టిగా ప్రయత్నించు"
నేల చాప ఇలా చెప్పింది: "మోకరిల్లి ప్రార్థించు"
మరుగుదొడ్డి ఇలా చెప్పింది: "చెడు అలవాట్లను వదిలించుకో"
బళ్లపై ఉన్న పుస్తకం (తిరుక్కురళ్ - ఇది తమిళంలో వల్లువర్ కృతి. దీనిని తమిళులు దక్షిణ వేదంగా పరిగణిస్తారు) ఇలా చెప్పింది: "సరైన విషయాల కోసం నన్ను చదువు"
ఆశ్చర్యంలో మునిగిపోయాను. మన చుట్టూ మన జీవితానికి కావాల్సినవి ఇన్ని ఉన్నాయా అని.
మనమే వాటిని అర్థం చేసుకోకుండా గుడ్డివాళ్లలా తిరుగుతున్నాం.
ఇక మేల్కొందాం!
విజయం సాధించుకుందాం!


కామెంట్‌లు