సరదా ముచ్చట్లు : - యామిజాల జగదీశ్


 బృందావనంలోని అందమైన కదంబ వనంలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన మురళిని ఓ కదంబ కొమ్మపై పెట్టాడు. దగ్గర్లోనే పూల బుట్టలతో ఉన్న ఆయన స్నేహితురాండ్రు ఆ వేణువును చూసి నవ్వడం మొదలుపెట్టారు.
ఒక చెలికత్తె చేతితో మురళి వైపు చూపించగా, మరొకరు నవ్వుతూ దాన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నట్లు నటించారు. 
ఒకరైతే "కృష్ణా, మాకు అందదు కానీ నువ్వే దాన్ని తీసుకుని మంచి పాట వినిపించొ చ్చుగా" అంది
వాళ్ల ప్రయత్నాలను చూస్తూ వారి మాటలను వింటూ కృష్ణుడు చిలిపి నవ్వు నవ్వుతూ "నాకూ అందదుగా... కొమ్మ మీద ఎవరా వేణువును ఉంచారో వారే వచ్చి తీసివ్వాలి... నా చేతిలో ఏముందీ" అన్నాడు.
చుట్టూ వికసించిన రంగురంగుల పూలు, పచ్చటి గడ్డి, ప్రశాంతమైన యమునా నది, పక్కనే ఉన్న అందమైన నెమలి ఈ సరదా ముచ్చట్లతో అక్కడి దృశ్యానికి మరింత అందాన్ని తెచ్చి పెట్టాయి.
కామెంట్‌లు