* ఇది నా పూర్వకర్మల ప్రారబ్ధమా...!? *:- కోరాడనరసింహా రావు


ఔను....ఇది నా పూర్వ జన్మల కర్మ ఫలమే...! 
 కాక పొతే... ఇదంతా నాకే ఎందుకు జరిగింది ?! 

పిల్లల కోసం పరితపించే ఆ దంపతులకు.... 
 నాలుగేళ్లకు గాని నేనుపుట్ట లేదట...! 

పుడితిని సరే... నష్ట జా త కుడనై 
తల్లి, దండ్రుల నేల కష్టముల పాల్జే సితిని...! 

మా తండ్రి, కొడుకులకు ప్రాణములు పోయే 
ప్రమాదాలై తే తప్పాయట....గానీగు డబ్బు, బంగారము 
అంతా పోయి ఇల్లు ఒళ్లు గుళ్లై పోయిందట...! 

ఒక కష్ట మైతే... చెప్పుకో వచ్చు... 
 ఎన్నని ఏకరువు పెట్టగలను
  కష్టములన్ని  ఒకదాని మీద ఒకటి వదలక నాపై దండ యాత్ర

లు చేస్తుంటే......!? 

 విరిగిన చెయ్యి, కాలిన కాలు, చేవిలో దూరిన
 గొంగలి పురుగు, తలపై కాలుతున్న తారాజువ్వపడి...బాధించిన మానని పుండు, 
 ఇవి చాలవన్నట్టు ఏడుమార్లు పీడించిన ఇ
నుప గజ్జి ,మూడుమా ర్లు వేధించిన అమ్మవారి కుండలు...  
బాల్యం లో పీడించిన ఈ ఛీడ, పీడ లన్ని నాకే ఎందుకు..!? 

నలుగురి పిల్లల్లా చదువుకో నివ్వక, బాల కార్మికునిగా 
మారిన దుస్తితి నాకే ఎందుకు జరిగింది...?! 

తండ్రి తాగు బోతై కుటుంబ భారం నా నెత్తినే ఎందుకు పడింది?? 

ఎందరికో  జీవితం వరమై వారంతా ఆనందంగా ఉంటే... 
 నాకే ఎందు కిలా శాప గ్రస్త జీవితమై పోయింది !! 

అనుకుంటూ కుమిలి పోయిన రోజు లెన్నో ! 

పది మందితో కలిసి కష్ట, సుఖాలు
 కల బోసు కున్నపుడే తెలిసింది...., 
  నాలాగా ఎందరో ఉన్నారని....!!

నాకే ఎందుకు జరిగింది అనుకోటం కేవలం నా అవివేకమేనని... 

పూర్వ జన్మల కర్మలలో మనం చేసుకున్న
 పాప, పుణ్య ఫలాలనే ఈ జన్మ లో 
సుఖ, దుఃఖాలుగా అనుభ వి స్తున్నామని...! 
    తర్కించి ఆలో చిస్తే బోధ పడింది...! 
     *****
కామెంట్‌లు