జయహో బాలసాహిత్యం
 

బాలల మిత్రులారా జేజేలు 
2014 నుండి మనం సిరిసిల్ల రంగినేని ట్రస్ట్ లో జరుపుకుంటున్న పిల్లల పండుగ గురించి మీకు తెలిసిందే.. మనలో చాలామంది పాల్గొన్నాం. 
ఈ 12 సెప్టెంబర్, 2026 శనివారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు “ మన బాల సాహిత్యం పిల్లలకు ఎంతవరకు చేరుతోంది, ఏం చేద్దాం… ఆలోచన” 
ఇకపోతే 
“తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న బాల సాహిత్య వికాసం- దశ, దిశ” చర్చ కార్యక్రమం నిర్వహించాలని ట్రస్ట్ సంకల్పం.
దీనికి తోడుగా 
2024, 2025, 2026 సంవత్సరాలకు 
రంగినేని లక్ష్మి బాలసాహిత్య పురస్కారం ముగ్గురు స్త్రీమూర్తులకు ప్రదానం చేయనున్నాం. 
జ్యూరీ పంపిన ప్రతిపాదనలు అందాయి. పురస్కార గ్రహీతల పేర్లు రాఖీ పండుగ రోజు కానుకగా ప్రకటిస్తాం.
చర్చలో పాల్గొనేందుకు మీ పేర్లను స్వచ్ఛందంగా యివ్వాలని విన్నపం.
మీ పేర్లు ఆహ్వాన పత్రం లో చేర్చేందుకు శ్రీ గరిపల్లి అశోక్ (Mob 98496 49101) నంబర్ కు పంపాల్సిందిగా మనవి. 
మీకు పై రెండు అంశాల్లో దేనిలో ఆసక్తి ఉంటే ఆ విషయాన్ని పేర్కొని పంపమనవి. 
మిత్రులారా…. 
ఒకరోజంతా కలిసి బాల సాహిత్యం గురించి మాట్లాడుకుందాం రండి! 
అంతేకాదు త్వరలో జరగబోయే 
మరో మంచి పెద్ద బాలసాహిత్య కార్యక్రమం గురించి ఆలోచన చేయాల్సి ఉంది.. 
తప్పక వస్తారు కదూ… 
జయహో బాలసాహిత్యం 
Rangineni Trust
Pillala Panduga Committee 
Sircilla
కామెంట్‌లు