శ్రావణమాసం: - పోచిరాజు వెంకట పద్మజ .- హైదరాబాద్


శ్రావణమాసం వచ్చింది
నల్లని మబ్బు తెచ్చింది 
చల్లని గాలి వీచింది 
వేడిని తరిమి కొట్టింది!!

 శ్రావణమాసం వచ్చింది
 నింగిని మేఘాలతో నింపింది
 చల్లని చినుకై జారింది
 పుడమి పచ్చగా నవ్వింది !!

శ్రావణమాసం వచ్చింది 
చినుకై గంధం పూసింది
మనసు ఆనందంలో తడిసింది
మోమున హరివిల్లై విరిసింది.!!


శ్రావణమాసం వచ్చింది
చినుకు,కిరణం కలిపింది 
నింగికి రంగులు అద్దింది
కళ్ళకు రంగుల తోరణం కట్టింది!!


శ్రావణమాసం వచ్చింది 
చినుకు వానై కురిసింది 
బామ్మ పడవ చేసింది
పడవ టాటా చెబుతూ సాగింది!!


కామెంట్‌లు