భరతుడు కౌసల్య మాటలకు బాధపడుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ధనధాన్యసంపదలతో తులతూగుచూ
రథాశ్వగజ బలములతో సమృద్ధముగాయున్న
విశాలమైన ఈ కోసల రాజ్యము 
ఆ కైక ద్వారా నీకు లభ్యమైనది 

కఠినాది కఠినమైన పెక్కు మాటలను 
కౌసల్యా దేవి భరతునితో పలికెను 
ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడైన 
భరతుని గుండెకు సూదులవలె గ్రుచ్చెను

వెంటనే భరతుడు కౌసల్య పాదాలపై బడెను
అతడు పెక్కు విధములుగా విలపించి 
అచ్చటనే స్పృహను కోల్పోయెను 
కొంతసేపటికి స్పృహలోకి వచ్చెను 

కౌసల్యకు అతడు అంజలి ఘటించెను 
కుమిలిపోవుచున్న కౌసల్యదేవితో 
భరతుడు ఇట్లు విన్నవించెను 
ఓపూజ్యురాలా! ఈ పట్టాభిషేకముగూర్చి 

నాకు ఏ విషయము తెలియదు తల్లి 
శ్రీరామునిపై నాకున్న భక్తిని నీవెరుగుదువు 
ఓ మాతా! ఏ పాపము ఎరుగని నన్ను 
నీవు ఇలా నిందించుచుంటివమ్మా!. 

కామెంట్‌లు