తర్వాత తర్వాతే...: - - యామిజాల జగదీశ్


 'తరవాత చదువుదాం' అని పక్కన పెట్టిన పుస్తకాన్ని తర్వాత ఎప్పుడూ చదవనేలేదు.
'తర్వాత చూడవచ్చు' అని దాచుకున్న 'లింక్‌'లలో దేన్నీ తర్వాత ఎప్పుడూ తెరిచి చూడనేలేదు.
'తరవాత కలవవచ్చు' అనుకున్న స్నేహితులను తర్వాత ఎప్పుడూ కలవనేలేదు.
'తరవాత చేయవచ్చు' అని వాయిదా వేసిన పనులను తర్వాత ఎప్పుడూ చేయనేలేదు.
'తరవాత తీర్చవచ్చు' అని అనుకున్న అప్పులను తర్వాత ఎప్పుడూ తీర్చనేలేదు.
'తరవాత చెప్పవచ్చు' అనుకున్న 'సారీ', ని తర్వాత ఎప్పుడూ చెప్పలేదు.
'తరవాత పోరాడవచ్చు' అనుకున్న న్యాయంకోసం ఎప్పుడూ పోరాడనే లేదు.
'తరవాత చెప్పవచ్చు' అనుకున్న ప్రేమను తర్వాత ఎప్పుడూ బయటపెట్టనే లేదు.
'తరవాత వెళ్లవచ్చు' అని కలలు కన్న సొంత ఇంటికి తర్వాత ఎప్పుడూ తిరిగి వెళ్లలేదు.
అందుకే కాబోలు పెద్దలు ఏదైనా సరే ఈ క్షణంలోనే జీవించమంటారు...కానీ, నా ఈ క్షణాలు ఏవీ నా చేతుల్లోనే లేవని ఎవరికి బోధపడుతుంది!!
కామెంట్‌లు