కూరలోకి ఉల్లిపాయ
మంచిరుచిని తెచ్చునయా!!
పచ్చిదైనా ఉల్లిపాయ
ఖచ్చితంగా మంచిదయా!!
ఊతప్పంలో ఉల్లిముక్కలు
లేకుంటే రుచిలేక తిప్పలు
కూరలలోనే కారమెక్కువైన
ఉల్లిపాయతో తగ్గే ట్రిక్కులు!!
వర్షాకాలం ఉల్లిపకోడీలు
కరకరలాడే కాలక్షేపం!
వేడివేడిగా ఉల్లిపులుసులు
చిటికెలో ఖాళీ అన్నం కంచం!!
పచ్చిపులుసులో ఉల్లిపాయలు
స్వర్గానికి బెత్తెడు దూరంలో
కోస్తే మాత్రం కళ్లలో నీళ్ళు
తరిగేటప్పుడు నువు దూరంలో!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి