ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు బాలు ఎంపిక

 తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయుడు , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం 15న బయలుదేరి ఫిన్లాండ్ లో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో  అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఆగస్టు 17 నుండి 26వ తేదీ వరకు  ఫిన్లాండ్ లోని తుర్కు యూనివర్సిటీ లో జరిగే ఎఫ్ .ఎల్ .ఎన్ శిక్షణా కార్యక్రమంలో  బాలు పాల్గొంటారు. మొత్తం 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవు తున్నారు. 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల బాలసుబ్రమణ్యం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సంగతి విధితమే. తిరుపతి జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాలుని  జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్.కుమార్, తొట్టంబేడు మండల విద్యాశాఖ అధికారులు భారతి,ముని తిరుమలయ్య, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
కామెంట్‌లు