ప్రతి ఏటా వస్తున్నా,
పండుగ వసంతమే.
అది తెచ్చేది సంతసమే.
పండగ తలపు వస్తే చాలు ,మనసు పరవశం,మనిషితలఊపడమే.
పండుగ పునరావృత్తం, ఆనందవృత్తం, మరింత విస్తృతమే.
పండుగల్లో రకాలు-- కుటుంబ, ధార్మిక, సామాజిక, జాతీయ. పుట్టినరోజు, సంక్రాంతి ,బాలల దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఉదాహరణలు. పండుగ ఏదైనా భాగస్వామ్యం అదృష్ట దాయకం. కలిసి ఉంటే కలదు సుఖం, పండుగ అసలు ఉద్దేశం.
ఉద్యోగాలు, వ్యాపారాలు, మనుషుల మధ్య దూరం పెంచే రోజుల్లో,మనుషుల్ని దగ్గర చేసి, మానవీయ సంబంధాల్ని బలోపేతం చేసే ,పర్వదినం, మన నిజవారసత్వం. పండుగల కలిసిన తరుణం ,పరస్పర అభిమాన, ఆప్యాయతల సంగమం కావాలి. భిన్నంగా పరస్పర ఆరోపణ, అసూయల కారణమైతే, జీవితం పాలకొండలో విషం చుక్క సదృశం.
ఓ పండుగ తెచ్చిన ఆనందం ,మరో పండుగ ఎప్పుడు వస్తుందా అనే ఎదురుచూపుకు ,తహతహకు, తావివ్వాలి.వ్యయప్రయాసలకు ఓర్చి,కలిసి ఉందామని వచ్చేవారి స్వీయ ప్రయత్నాన్ని, బంధువులంతా ఆదర్శంగా, తీసుకోవాలి. కలిసి ఉన్నప్పుడు పనిని, పంచుకుంటూ, ఆనందాన్ని పెంచుకుంటూ ,ప్రతిక్షణం ఆస్వాదించాలి.
పిల్ల పెద్ద ,ఆడ మగ, అన్ని వయసుల వారు ,పరస్పర సంబోధనలు,పిండివంటలకంటే
ఎంతో ప్రీతినిస్తాయి. రోజులిట్టే గడిచిపోతాయి. వీడ్కోలు సమయాన మనసులు ఆనందంతో బరువెక్కుతాయి.
పండుగకు వెళ్లొచ్చాం ,అని చెప్పుకోవడం ఓ సంతృప్తి సూచకము. తర్వాతి తరం వాళ్లకి ,సంబంధాలు కొనసాగించమని ప్రత్యక్షంగా చెప్పి వేదికే ,పాల్గొన్న ప్రతిపండుగ.
________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి