పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నా దేశం నా బాధ్యత అను అంశంపై నిర్వహించిన కవితలపోటీల్లో తిరుమలరావు పాల్గొని విజేతగా నిలిచారు. ఎనభయ్యో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో తిరుమలరావు పాల్గొనగా, అందులో టాప్ 20 లో నిలిచి విజేత ప్రశంసాపత్రం అంతర్జాలం ద్వారా పొందారు. తిరుమలరావు పంపిన జైహింద్ అనే కవిత విజేత స్థానాన్ని సొంతం చేసుకుంది. 170 రాష్ట్ర సదస్సులు జాతీయ కవి సమ్మేళనాలు ప్రపంచ మహాసభలను ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక, 36 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సాహిత్య సంస్థగా నిలిచింది. గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్న ఘనత శ్రీ శ్రీ కళా వేదిక సొంతం. తిరుమలరావు పంపిన రచనలో బాధ్యత అంటే తీసుకునేదే అంటూ, మార్పు అంటే నాతోనే మొదలవ్వాలంటూ,
దేశం కోసం ఉరికొయ్యను ముద్దాడిన త్యాగధనుల పురిటి గడ్డ నా ఈ పుణ్యక్షేత్రం అంటూ రచించారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి డా.టి.పార్ధసారథి, జాతీయ కార్య నిర్వహణ అధ్యక్షులు నూక సంపత్ కుమార్, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ నల్లా భాగ్యలక్ష్మిల పర్యవేక్షణలో జరిగిన కవిత పోటీలకు, మళేకార్ నాగజ్యోతి, చండ్ర వెంకటేశ్వరరావు, నరసింహశర్మ, సాహు సంధ్య, సువర్ణ జోషి, సబ్బెళ్ళ మహాలక్ష్మి రెడ్డి, తాటి హరీష్, పి.సాయి సంతోషిలు సమన్వయకర్తలుగా వ్యవహరించి తిరుమలరావును అభినందిస్తూ విజేతగా ఎంపిక చేస్తూ విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఐన కుదమ తిరుమలరావు గానం, చిత్రలేఖనం, నటన, రచన, సేవారంగాలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ, నేడు జాతీయ స్థాయి కవితల్లో విజేతగా నిలుచుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి