అప్పుడు భరతునితో ఇట్లు వచించెను
అయ్యా! భరతా! క్రూరురాలైన నీ తల్లి
వరములను కోరి రాముని అడవికి పంపి
రాజ్యాధికారమునకై చూచుచున్నది
నీకై రాజ్యమును సంపాదించి పెట్టినది
నా శ్రీరాముని నార చీరలు ధరింపజేసి
అతనిని అడవుల పాలు చేసినది
దాని వలన ఆమె ఏమి బావుకొనదలచెనో
నా కుమారుడు మిగుల యశస్వి
బొడ్డున బంగారముతో పుట్టినవాడు
అతడు ఎంతో అదృష్టవంతుడు
ఆమె చేతిలో అధికారము ఉన్నది కదా!
ఆమె నన్ను కూడా వనమునకు పంపి
పుణ్యమును మూట గట్టుకొనుట
ఎంతయో సముచితముగా యుండును
లేనిచో సుమిత్ర,నా తోడుగా నడవగా
స్వయముగా అగ్నిహోత్రము దీసికొని
రాముడు ఉన్న అడవులకు వెళ్ళెదను
లేదా! నీవే నన్ను స్వయంగా తీసుకెళ్ళు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి