గతిని మార్చు గమనాలు
దిశను చూపు కాంతులు
దశను మార్చు దివిటీలు...
సమయం పెట్టే పరీక్షలు
సహనంతోనే గెలవాలి
సమస్యలు తీరేదాకా
సహగమనం చేయాలి
కదిలే కాలంతో
కలిసే నడవాలి
కలతలు కన్నీళ్లు
కనులలోనే దాచాలి
మనసుకు తగిలే దెబ్బలు
కసిగా మార్చుకోవాలి
చెప్పాలనుకున్న బదులు
మన విజయం చెప్పాలి
ఈదలేని ఏటిలోన
వాలు మార్చుకోవాలి
ఎదురీత చేసయినా
తగిన తీరం చేరాలి
కొదవ లేని నమ్మకం
కొరత లేని ధైర్యం ఉంటే
వెలుగు తెచ్చే వేకువలో
కలిసొచ్చే క్షణాలెన్నో!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి