గమనంలో...
అలజడి నిండిన
హృదయానికి
జలజల జారే జలపాతపు
సవ్వడి లో
జీవనరాగం వినిపించదా!
యదార్థమేదో ఎరుగక
పదార్థాల వెంట పరిగెడితే
అనర్థాలే ఎదురై... జీవితం
వ్యర్థంగా మిగిలిపోదా..
నీరునిండిన మబ్బులన్నీ
నింగిలోనే సాగుతున్నా...
నీటి చెమ్మ తగలక గగనం
నిశ్చలంగా లేదా...
నిశ్శబ్దంగా చేసే యుద్ధపు
ఆనవాళ్లు తెలియనీక
పెదవుల పై నవ్వులు మోస్తూ
పంటిబిగువున అదిమి పట్టిన...
పచ్చి గాయపు సలుపులు
విచ్చిన వెలుగుల వేకువలో
వచ్చిన ధైర్యపు ఆసరాతో
కచ్చిగా గెలుపుకై పోరాడదా!
పరమార్థం తెలుసుకుని
ప్రవర్తన మార్చుకుని
ప్రయాణం కొనసాగిస్తే
పచ్చని మనుగడ సొంతం కాదా!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి