ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా పాత తాండూర్‌లోని ప్రభుత్వ నంబర్–2 పాఠశాల విద్యార్థులకు అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల కళావేదిక తాండూర్ ఫౌండర్ అధ్యక్షులు, సోషల్ వర్కర్ KVM వెంకట్ పాల్గొని విద్యార్థులకు అవయవ దానం ప్రాముఖ్యత, అపోహలు–వాస్తవాలు, అవయవ దానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం గురించి వివరించారు. విద్యార్థులు అవయవ దానంపై అవగాహన పెంచుకుని, తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ సందేశాన్ని తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రతిభా భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి