పరుగుబుసల లోహనాగు!(మెట్రో): - వరలక్ష్మి యనమండ్ర


లోహనాగు పరుగులుతీస్తూ వస్తున్నది దూరాన్ని కొల్చుకుంటూ
వెలుగుకళ్ళతో చీకటినలుపును శరవేగంగా చీల్చుకుంటూ

కాలానికి రెక్కలు కట్టిన ఆధునికపు అశ్వమిది
క్షణాల్లో దూరాలను మాయం చేసే యంత్రమిది

గాజు కిటికీల వెంట పరుగెత్తే  నగర చిత్రాలు
సినిమారీలు వలె  జారిపోవు సుందర దృశ్యాలు

స్టేషను స్టేషనుకి మనల్ని చేర్చే సారధిలా!
మనుషుల కలలను గమ్యానికి చేర్చు వారధిలా!

తెల్లవారు జాము నుండి రాత్రి వరకు అవిశ్రాంతం
లక్షల గుండెచప్పుళ్ళను మోసుకెళ్ళే రవాణాయంత్రం!

జారుతున్న తలుపుల సవ్వడి విను లయబద్ధ గీతం
ప్లాట్‌ఫారమ్ పేరు మైకులో వినిపించు మధుర స్వరం

రయ్యిన దూసుకుపోవు వేగం చేర్చును నిను గమ్యం 
సొరంగపు చీకటి దాటి వెలుగు లోకం చేరు ప్రయాణం

కాలుష్యానికి దూరంగా, పర్యావరణానికి చేరువగా
నవ నగరపు వెలుగు రేఖ ఈ లోహపు రథం అందంగా

గమ్యం చేరువైనప్పుడు ఆగే క్షణికమైన విరామం
తిరిగి బయలుదేరును వెంటనే...నిరంతర చలనం

మెట్రో రైలు నిజంగా ఈ యుగపు వేగానికి ప్రతీక
మనుషుల మనసులను గమ్యాలకు కలిపే మాత్రిక

కామెంట్‌లు
Viritha చెప్పారు…
Nice writing
A Chandra Shekar చెప్పారు…
Good one 👌